సునామి

2004, డిసెంబర్ 26 న థాయిలాండ్ తీరాన్ని ముంచెత్తిన సునామి
2004, డిసెంబర్ 26 న థాయిలాండ్ తీరాన్ని ముంచెత్తిన సునామి
అగ్ని పర్వత విస్ఫోటనాలు టన్నుల కొద్దీ బూడిదను వెదజల్లి వినాశక తరంగాలను సృష్టిస్తాయి.
అగ్ని పర్వత విస్ఫోటనాలు టన్నుల కొద్దీ బూడిదను వెదజల్లి వినాశక తరంగాలను సృష్టిస్తాయి.
సముద్ర గర్భ భూకంపాలు భూమి పైపొరకు స్థాన చలనం కలిగించి, సముద్రపు నీటిని పైకి పొంగిస్తాయి.
సముద్ర గర్భ భూకంపాలు భూమి పైపొరకు స్థాన చలనం కలిగించి, సముద్రపు నీటిని పైకి పొంగిస్తాయి.

సముద్రపు నీటికి కలిగిన స్థానభ్రంశం కారణంగా సముద్రంలో ఏర్పడిన అలల శ్రేణిని సునామి (tsunami) అని అంటారు. భూకంపాలు, నీటిపై గానీ లోపల గానీ కలిగే తీవ్ర చలనాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియల పతనాలు, ఉల్కాపాతాలు, అణువిస్ఫోటనాలు మొదలైన వాటి కారణంగా సునామి రావచ్చు. సునామి ప్రభావం గమనించలేనంత చిన్నదిగా ఉండొచ్చు, లేదా వినాశకరంగానూ ఉండొచ్చు.


సునామి అనేది జపనీసు పదం. దీనికి హార్బరు అలలు అని అర్థం. వేటకు వెళ్ళి తిరిగి వచ్చిన మత్స్యకారులు అలల కారణంగా తమ రేవు నాశనమై ఉండడాన్ని గమనించి, అలాంటి అలలు తమకు సముద్ర మధ్యంలో ఎక్కడా కనిపించని కారణంగా వీటికి హార్బరు అలలు అని పేరు పెట్టారు. జపాను చరిత్రలో సునామీలు సర్వసాధారణం. దాదాపు 195 సునామీలను ఇప్పటి వరకు నమోదు చేసారు.


సునామీ అల చాలా తక్కువ ఎత్తుతోను చాలా ఎక్కువ తరంగ దైర్ఘ్యంతోటీ ఉంటుంది. తరంగ దైర్ఘ్యం కొన్ని కిలోమీటర్ల తరబడి ఉంటుంది. ఈ కారణంగానే సముద్ర మధ్యంలో సునామీ ఉనికి తెలియదు. తీరానికి చేరే కొలదీ సునామీ అల విపరీత వేగంతో ముందుకు దూకుతుంది. మామూలు అలల్లాగా ఎత్తుకు లేవదు. సముద్రపు అలలకు, సునామీకి పోలిక లేదు. అంచేత సముద్ర శాస్త్రజ్ఞులు వీటిని అలలు అని పిలవరు. [1]

"http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF" నుండి వెలికితీశారు

Drogi pompa ciepla bento kronen darmowe teledyski i videoclipy tworzenie stron warszawa tłumacz z Poznania Pożyczki Dobry hosting Zdjęcia opisy na gg Gadu Gadu kartki Gilotyna Wymagania - tylko tutaj ! Klub audi kick koparki Bułgaria wczasy Karaoke tani kredyt hipoteczny COOLsurf