|
పరికరాల పెట్టె |
వికీపీడియా:శైలిరచనలను ఒక క్రమపధ్ధతిలో, చదవడానికి చక్కగా వీలయ్యే విధంగా రాయడానికి అవసరమైన మార్గదర్శకాల సమాహారమే ఈ శైలి మాన్యువల్. కింది నియమాలు చివరి మాటేమీ కాదు. ఒక పధ్ధతి ఇతర పధ్ధతి లాగే బాగుండవచ్చు, కానీ అందరూ ఒకే పధ్ధతిని అనుసరిస్తే, వికీపీడియా చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యను గమనిద్దాం:
రచన ఎలా అందంగా తీర్చి దిద్దాము అనేదానికంటే, అది ఎంత స్పష్టంగా, సమాచార సహితంగా, పక్షపాత రహితంగా ఉంది అనేది ముఖ్యం. రచయితలు ఈ నియమాలేవీ పాటించవలసిన అవసరం లేదు.
[మార్చు] వ్యాసం పేరుప్రధాన వ్యాసం: నామకరణ విధానం వీలయినంత వరకు వ్యాసం పేరు వ్యాసం యొక్క మొదటి వాక్యం లోనే వచ్చేలా ఉండాలి. పేరు మొదటిసారి వ్యాసంలో కనిపించేటపుడు, దానిని బొద్దుగా చెయ్యండి. ఉదాహరణ చూడండి: పేరును ఇటాలిక్స్ లో పెట్టదలిస్తే, పేరు మొత్తాన్ని పెట్టాలా లేక కొంత భాగాన్ని మాత్రమే పెట్టాలా అనే విషయమై ఇటాలిక్స్ నియమాలను పాటించండి. [మార్చు] భాషమందార మకరంద మాధుర్యమును బోలు అన్న తెలుగు వాక్యాన్ని అనుసరించి, మీకు తెలిసినంతలో మంచి తియ్యనైన తెలుగు పదాలతో వ్యాసాన్ని రాయండి. మాట్లాడే శైలి కాకుండా రాసే శైలిని అవలంభించండి. అప్పుడే తేనెలొలుకు తెలుగు అన్న సామెత సార్థకమౌతుంది. [మార్చు] వ్యక్తుల పేర్లువ్యక్తులు, సంస్థలు, ఊళ్ళు మొదలైన వాటి పేర్లు రాసేటపుడు కింది పద్ధతులను పాటించాలి.
గమనిక: ఏ పేరు వాడాలనే విషయంలో సందిగ్ధత ఉంటే ఒకపేరుతో పేజీ సృష్టించి, రెండో దానితో దారిమార్పు పేజీని సృష్టించండి.
[మార్చు] గౌరవ వాచకాలు
వ్యక్తుల గురించి రాసేటపుడు, శ్రీ, గారు వంటి గౌరవ వాచకాలు ఉపయోగించవద్దు. వచ్చారు, అన్నారు, చెప్పారు వంటి పదాలను కాక వచ్చాడు, అన్నాడు, చెప్పాడు అని రాయాలి. [మార్చు] విభాగాలు, శీర్షికలుప్రధాన వ్యాసం: శైలి మాన్యువల్ విభాగాల శీర్షికల కొరకు
ఈ వాక్యం ఇలా కనపడుతుంది..
శీర్షికలను ఇలా పెడితే, విషయ సూచిక ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. అభిరుచులలో నిశ్చయించుకోవడం ద్వారా విభాగాలకు సంఖ్యలు వచ్చే విధంగా చేసుకోవచ్చు. శీర్షికల వలన వ్యాసాన్ని చదవడం తేలికగా ఉంటుంది.
[మార్చు] ఇటాలిక్స్ఈ విధంగా రాయాలి:
ఇది ఇలా కనిపిస్తుంది
కొన్ని పదాలను నొక్కి చెప్పేందుకు ఇటాలిక్స్ ను వాడతాము. ఈ కింది సందర్భాలలో కూడా వీటిని వాడవచ్చు. [మార్చు] శీర్షిక పేరు
కింది వాటి పేర్లకు ఇటాలిక్స్ ను వాడాలి:
సాధారణంగా పెద్ద వాటికి ఇటాలిక్స్ ను వాడతారు. చిన్న వాటికి డబల్ కొటేషను గుర్తులు వాడాలి. ఉదాహరణకు:
కొన్ని సందర్భాలలో పేర్లు ఇటాలిక్స్ లో గాని, డబల్ కొటేషను గుర్తుల్లో గాని ఉండకూడదు. అవి:
[మార్చు] పదాల్లాగా పదాలుపదాల గురించి పదాల లాగా, అక్షరాల గురించి అక్షరాల లాగా రాస్తున్నపుడు ఇటాలిక్స్ వాడండి. ఉదాహరణకు:
[మార్చు] అరువు పదాలుఇతర భాషల నుండి తెలుగు లోకి తెచ్చిన పదాలను ఇటాలిక్స్ లో రాయాలి. అయితే తెలుగులో ఒదిగిపోయిన రైలు వంటి పదాలకు ఇటాలిక్స్ వాడరాదు. ఇటాలిక్స్ అనే పదాన్ని గమనించండి, ఇది ప్రతిచోటా ఇటాలిక్స్ లోనే ఉంది. ఆది అరువు పదం కనుక అలా ఉంది. గొప్ప వ్యాసం రాయడం ఎలా ప్రకారం, ఇతర భాషా పదాలు అరుదుగా, వేరే పదం లేనప్పుడు మాత్రమే వాడాలి. [మార్చు] సూక్తులు, సుభాషితాలు, ఉటంకింపులు, ఉదహరింపులువ్యాఖ్యలను ఉదహరించేటపుడు ఇటాలిక్స్ వాడవలసిన పని లేదు, ఆ వాక్యాలకు ప్రత్యేకంగా అవసరమైతే తప్ప. [మార్చు] వ్యాకరణ చిహ్నాలుమామూలుగా వ్యాకరణ చిహ్నాలను ఎలా వాడుతామో అలాగే వాడండి. [మార్చు] కొటేషను గుర్తులుసాధారణంగా డబల్ కొటేషను గుర్తులను వాడండి—చదివేటపుడు సులభంగా ఉంటుంది. — కొటేషన్ల లోపల కొటేషన్లు అవసరమైనపుడు సింగిలు కొటేషను గుర్తులను వాడండి. గమనిక: ఏదైనా పదం 'ఇలా' సింగిలు కొటేషను గుర్తుల్లో ఉంటే, అన్వేషణ జరిపేటపుడు సింగిలు కొటేషను గుర్తులను కూడా ఆ పదంలో భాగంగానే గుర్తిస్తుంది. అన్వేషణలో పదంతో పాటు కొటేషన్లను కూడా ఇస్తేనే, ఆ పదాన్ని పట్టుకుంటుంది. డబల్ కోట్లను వాడటానికి ఇది మరో కారణం, ఎందుకంటే, దాని విషయంలో ఈ ఇబ్బంది రాదు. [మార్చు] ఇతరత్రా..[మార్చు] ఈ పేజీలో మీకు అవసరమైనది దొరక్కపోతేఈ పేజీలో శైలికి సంబంధించి మీకు అవసరమైన సమాచారం దొరక్కపోతే, మీకు నచ్చిన వ్యాసం ఒకదానికి వెళ్ళి, దాని మార్చు పేజీకి వెళ్ళండి. ఆక్కడ రచయితల శైలి ఎలా ఉందో చూడండి. తరువాత పేజీని భద్రపరచకుండా వదిలేయండి. దాదాపు ప్రతీ వ్యాసాన్ని కూడా మెరుగుపరచవచ్చు. [మార్చు] అతిగా అలంకరణ కూడదుమీ వ్యాసంలో మరీ ఎక్కువ మార్కప్ లను వాడకుండా ఉంటే మీకు, వ్యాసం చదివేవారికి కూడా సులభంగా ఉంటుంది. మీరు వ్యాసంలో పెట్టిన మార్కప్ అంతా వ్యాసంలో కనపడుతుందని అనుకోకండి. మార్కప్ లను అవసరమైన మేరకే - వ్యాసాన్ని సులభంగా చదవటానికి అవసరమైనంత వరకే - వాడండి. అతిగా వాడి, క్లిష్టతరం చెయ్యవద్దు. HTML, CSS మార్కప్ లను తక్కువగా వాడండి. విజ్ఞాన సర్వస్వం ఉపయోగకరంగా ఉండాలనేది మొదటి లక్ష్యమైతే, దానిలో దిద్దుబాట్లు చెయ్యడం సులభంగా ఉండటమనేది మరో ముఖ్య లక్ష్యం.
[మార్చు] వ్యాఖ్యానాలను కనపడనీయకండివ్యాసం అసంపూర్తిగా ఉందనీ, మరింత పని జరగాల్సి ఉందనీ ఎత్తి చూపకండి. అసలు విషయం లేకుండా, ఉత్త శీర్షికలతో పాఠకుడికి ఉపయోగమేమీ ఉండదు. మామూలు పాఠకుడికి కాకుండా, దిద్దుబాట్లు చేసే సభ్యులకు ఏమైనా సందేశం ఇవ్వదలిస్తే, ఆ సందేశాన్ని కింది గుర్తుల మధ్య పెడితే సరిపోతుంది. ఉదాహరణకు:
ఇలా కనిపిస్తుంది:
వ్యాఖ్య, దిద్దుబాటు చేసే వారికి మాత్రమే కనిపిస్తుంది. [మార్చు] సంబోధన కూడదువిజ్ఞాన సర్వస్వంలోని వ్యాసాల్లో మిమ్మల్ని గాని, పాఠకుడిని గాని మీరు సంబోధించరాదు. అంటే - నేను, మేము, మీరు, మనం వంటి పదాలు రాకూడదు. ఉదాహరణకు నేను అనుకునేదాని ప్రకారం.., దాన్ని మనం ఇలా అర్ధం చేసుకోవచ్చు.. వంటి వాక్యాలు రాయకూడదు. [మార్చు] ఇంకా చూడండి
|