|
పరికరాల పెట్టెఇతర భాషలు
|
భూకంపంభూకంపము (ఆంగ్లం : Earthquake) : భూమి పై పొరలో అకస్మాత్తుగా విడుదలయ్యే శక్తి సీస్మిక్ తరంగాలను విడుదల జేస్తుంది. దీని కారణంగా భూకంపం ఏర్పడుతుంది. భూకంపాలను సీస్మోగ్రాఫుతో కొలుస్తారు. భూకంప తీవ్రతను మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేలు మీద గానీ రిక్టరు స్కేలు మీద గానీ కొలుస్తారు. ఈ స్కేలు మీద 3 లేదా అంతకంటే తీవ్రత కలిగిన భూకంపాలు మానవ అనుభవంలోకి రావు. 7, ఆపై తీవ్రత కలిగిన భూకంపాలు విశాల ప్రాంతంపై తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ప్రకంపనల తీవ్రతను మెర్కాలి స్కేలు మీద కొలుస్తారు. భూమిని కంపింపజేయడం ద్వారా, ఒక్కోసారి భూమికి స్థానచలనం కలుగజేయడం ద్వారా భూతలంపై భూకంపాలు తమ ప్రభావాన్ని చూపిస్తాయి. భూకంప కేంద్రం సముద్రంలో కేంద్రీకృతమైనపుడు, భూచలనం తగు తీవ్రతతో ఉన్నపుడు సునామి ఏర్పడే అవకాశం ఉంది. భూకంపంతో సంభవించే ప్రకంపనాల కారణంగా భూచరియలు విరిగిపడడం, అగ్నిపర్వత విస్ఫోటనాలు కూడా సంభవించవచ్చు. సాధారణంగా ప్రాకృతికంగా గానీ, మానవ ప్రేరితంగా గానీ ఏర్పడే భూ ప్రకంపనలన్నింటినీ భూకంపాలనే అంటారు. భూకంపాలు సాధారణంగా భౌగోళిక లోపాల కారణంగా ఏర్పడతాయి. అగ్ని పర్వతాల విస్ఫోటనం కారణంగాను, కొండచరియలు విరిగిపడడం ద్వారాను, గనుల్లో జరిగే పేలుడు ద్వారాను, అణు విస్ఫోటనలా ద్వారా కూడా భూకంపాలు ఏర్పడవచ్చు. భూకంపం మొదలైన స్థానాన్ని హైపోసెంటర్ అంటారు. సరిగ్గా ఈ స్థానానికి పైన భూ ఉపరితలంపై ఉన్న స్థానాన్ని ఎపిసెంటర్ (బహిర్కేంద్రం) అంటారు. [మార్చు] ఇవీ చూడండి
|