|
|
నాగాలాండ్
నాగాలాండ్, ఈశాన్య భారత దేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు మణిపూర్ రాష్ట్రాలు మరియు మయన్మార్ దేశము సరిహద్దులుగా కలవు. రాష్ట్ర రాజధాని కోహిమా. నాగాలాండ్ 7 జిల్లాలుగా విభజించబడినది. జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు ఇండో-మంగోలాయిడ్ జాతికి చెందిన వారు. ఇతర అల్పకసంఖ్యాక తెగలలో చిన్ ప్రజలు 40,000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220,000 అస్సామీలు మరియు 14,000 బెంగాళీ ముస్లిం లు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులు. హిందూ ఆధిక్య భారతదేశములో నాగాలాండ్ ఈ క్రైస్తవ వారసత్వాన్ని పక్కనున్న మిజోరాం మరియు మేఘాలయ రాష్ట్రాలతో పంచుకొంటున్నది.
[మార్చు] ఇటీవలి చరిత్ర
నాగాలాండ్ డిసెంబర్ 1, 1963 న రాష్ట్రముగా అవతరించినది. 1956 నుండి భారత దేశములో అంతర్భాగముగా, మరియు దీనికి మునుపు స్వంతంత్ర భుభాగముగా దీని స్థాయి వివాదాస్పదమైనది. కొన్ని వర్గాలు దీన్ని ఆసరాగ తీసుకొని స్వతంత్ర ప్రతిపత్తికై ఆందోళన చేస్తున్నారు.
2004, అక్టోబర్ 2న జరిగిన దాడులలో, అస్సాం మరియు నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు రెండు వేర్పాటువాద తిరుగుబాటుదారు గ్రూపులు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం మరియు నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఈ చర్యలకు బాధ్యులని భావిస్తున్నారు.
- జానాభా: 15.5 లక్షలు (2000)
- రాజధాని: కోహిమా (జనాభా. 63,000)
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
|