|
|
|
గూగుల్
గూగుల్ ఇంక్. ఒక అమెరికన్ పబ్లిక్ కార్పోరేషన్. ప్రసిద్ధ శోధన యంత్రం(ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్-Google),
[మార్చు] గూగుల్ గురించిసెప్టెంబర్ 1998 వ సంవత్సరంలో ఒక ప్రైవేటు ఆధీనములో ఉన్న కార్పోరేషను గా స్థాపించబడింది. మౌంటెన్ వ్యూ, కాలిఫోర్నియాలో ఉన్న ఈ కంపెనీలో సుమారుగా 19,604 మంది పనిచేస్తారు. ఇదివరకు నోవెల్ కంపెనీ సీఈవో (CEO)గా పనిచేసిన ఎరిక్ ష్మిడ్త్ ప్రస్తుత గూగుల్ సీఈవో. గూగుల్ అనే పదం గూగోల్ అనే పదం నుంచి వచ్ఛింది. గూగోల్ అనేది ఒకటి పక్కన వంద సున్నాలు గల సంఖ్య. కాలిఫోర్నియా లో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని గూగుల్ప్లెక్స్ (1 తర్వాత 10వేల సున్నాలు కల సంఖ్య) అని అంటారు. గూగుల్ యొక్క సేవలు ఎన్నో సర్వర్ క్షేత్రాల మీద పనిచేస్తాయి. ఒక్కో సర్వర్ క్షేత్రం ఎన్నో వేల స్ట్రిప్ చేసిన లినక్స్ వర్షన్ల మీద పనిచేస్తాయి. కంపెనీ ఆ వివరాలు వెల్లడించదు కానీ సుమారుగా ఒక లక్ష లినక్స్ యంత్రాలను ఉపయోగిస్తుందని అంచనా. నీల్సెన్ కాబినెట్ ప్రకారం ఇతర శోధనాయంత్ర ప్రత్యర్ధులు, యాహూ (23%), ఎమ్.ఎస్.ఎన్ (13%)ను దాటి 54% మార్కెట్ వాటా కలిగి ఉంది గూగుల్. [మార్చు] చరిత్ర[మార్చు] ప్రారంభం1996 జనవరిలో, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయములో లారీ పేజ్ మరియు సెర్జీ బ్రిన్ అను ఇద్దరు పి.హెచ్.డి విద్యార్థులచే ఒక పరిశోధనా ప్రాజెక్టుగా గూగుల్ మొదలయ్యింది.[3] అప్పటి వరకు ఉపయోగంలో ఉన్న శోధనాయంత్రాలలో ఉపయోగిస్తున్న సాంకేతికత కంటే వెబ్సైట్ల మధ్య గల సంబంధాన్ని సంక్షోధించగలిగే సాంకేతికత మరింత మెరుగైన శోధనాయంత్రాన్నివ్వగలదని వారు భావించారు(అప్పటి వరకు అందుబాటులో ఉన్న శోధనాయంత్రాలు ఒక పదం ఒక పేజీలో ఎన్ని సార్లు తటస్థపడుతుంది అనే దానిపై ఆధారపడేవి).[4]దీనికి అనుబంధించిన వ్యవస్థ వెబ్సైట్ యొక్క ప్రాముఖ్యతను ఆంచనా వేయటానికి బాక్ లింకులు (అక్కడికి లింకులున్న పేజీలు) తనిఖీ చేస్తుండటం వలన మొదట్లో దీన్ని "బాక్ రబ్" అని పిలిచేవారు.[5] రాన్‌డెక్స్ అనే ఓ చిన్నపాటి శోధనాయంత్రం అప్పటికే ఈ పద్ధతిని పరిశీలిస్తున్నది.[6] ఈతర వెబ్ పేజీల నుండి ఎక్కువ లింకులు కలిగి ఉన్న వెబ్ పేజీలే సెర్చ్ చెయబడుతున్న పదం తో ఎక్కువ సంబంధం కలిగినవిగా దృవీకరించుకున్న తర్వాత పేజ్ మరియు బ్రిన్ తమ పరిశోధనలొ బాగంగా, కొన్ని పరీక్షల అనంతరం, తమ సెర్చ్ ఇంజన్ కు పునాది వేసారు. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము కి చెందిన వెబ్సైట్ ను సెర్చ్ ఇంజన్ మొదట వాడింది. దాని డొమైన్ google.stanford.edu. google.com డొమైన్ సెప్టెంబర్ 15, 1997 న నమోదు చేయబడింది. సెప్టెంబర్ 7, 1998 న Google Inc. మెన్లో పార్క్, కాలిఫోర్నియా లో ఒక స్నేహితుని ఇంటి గారేజీ లో కంపెనీ గా అవతారం ఎత్తింది. సిలికాన్ వాలీ లో ఇతర అనేక ప్రముఖ సంస్థలకు పుట్టినిల్లు అయిన పాలో ఆల్టొ, కాలిఫోర్నియా కు మార్చి, 1999 న తమ కార్యాలయాన్ని గూగుల్ మార్చింది. ఆక్కడ నుండి అతి స్వల్ప కాలం లోనే రెండు మూడు ఇతర బవన సముదాయాలకు తమ కార్యలయాన్ని మార్చిన తర్వాత 2003 వ సంవత్సరంలో మౌంటేన్ వ్యూ లో 1600,ఆంఫీ థియేటర్, పార్క్ వే వద్ద గల భవన సముదాయం లో స్థిరపడ్డారు. సిలికాన్ గ్రాఫిక్స్ సంస్థ గూగుల్ కు ఈ భవనాలను లీజు కి ఇచ్చింది. గూగుల్ పెరుగుతున్న ఇంటర్ నెట్ వినియోగదారులలో అంతులేని వీర అభిమానులను సంపాదించుకుంది. అనవసరపు బొమ్మలు, చిత్రాలు లేని గూగుల్ ముఖ్య పేజికి వినియోగదారులు ఆకర్షితులైయ్యారు.హడావిడిని ఇష్టపడని వినియోగదారులను సైతం ఇట్టె ఆకర్షించగలిగింది గూగుల్. ఆల్టా విస్టా శైలినే అనుసరిస్తూ తమ ప్రత్యేక శోధక సామర్ధ్యాన్ని ఇముడ్చుకుంది గూగుల్. 2000 సం|| లో గూగుల్ వ్యాపార ప్రకటనలను అమ్మడం మొదలు పెట్టింది. శోదించుటకు ప్రవేశపేట్టిన పదంతో అది ముడిపడిన వ్యాపార శైలి. వ్యాపార ప్రకటనల ద్వార వస్తున్న ఆదాయాన్ని పెంచుకొనుటకు ఎంతొ అవసరమైనది, ఎంత మంది వినియోగదారులు వ్యాపార ప్రకటన ఇచ్చిన సంస్థకి సంభందించిన లింక్ ను నొక్కితే గూగుల్ కు అన్ని డబ్బులు(ప్రతి క్లిక్కుకి కొన్ని సెంట్ల చొప్పున). ఈ వ్యాపార ప్రకటనలలో బొమ్మలు లేకుండా కేవలం వ్యాఖ్యల రూపంలో ఉండడం వలన పేజి త్వరితగతిన తెరవగలగటమే కాకుండా ప్రకటనకర్తలు, వినియొగదారులు తమ లింకులను నొక్కేట్టప్పుడు చెల్ల్లించ వలసిన డబ్బుల ఖర్చు తగ్గించింది. ఈ రకమైన ముఖ్యపదాల ఆదారిత వ్యాపార ప్రకటనల పద్దతిని గొటు.కామ్ అనే సంస్థ మొదలు పెట్టింది(కాలక్రమేణ దానికే ఒవెర్ ట్యూర్ గా ఆ తర్వాత [యాహూ సెర్చ్] గా మార్కెటింగ్ నామకరణం జరిగింది) [7]ఏ ఇంటర్నెట్ మార్కెటింగ్ విషయంలో అయితే తమ డాట్ కాం ప్రత్యర్ధులు విఫలం చెందారో గూగుల్ అందులోనే విజయం సాధించి వ్యాపారాన్ని పెంచుకుంటూ లాభాలను ఆర్జించసాగింది. సెప్టెంబర్ 4 న గూగుల్ పేజ్ ర్యాకింగ్ పద్దతిని వివరించే పేజ్ ర్యాకింగ్ కు పెటెంట్[8] ఇవ్వడం జరిగింది.అధికారికంగా ఈ పేటెంట్ హక్కుదారులు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము వారు అయితే, కనుగొన్నవారుగా లారెన్స్ ని పేర్కొనబడింది. [మార్చు] వృద్ధిదినదిన అభివృద్దితో వినియోగదారులకు అత్యంత చేరువైన గూగుల్ సాంకేతిక రంగంలో అప్పటివరకు వెలుగు తున్న కంపెనీలకు పెద్ద సవాలుగా తయారైయింది. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య నెలకొన్న వైరాన్ని చూడండి.[9] గూగుల్ నుండి ఎదురౌతున్న పోటీని ఎదుర్కోవటానికి మైక్రోసాఫ్ట్ తన శోధనాయంత్రాన్నిఎం.ఎస్.ఎన్ సెర్చ్ మరియు ఈ 2006 ఫిబ్రవరీలో విడుదలైన విండోస్ లైవ్ సెర్చ్‌లకు లెక్కా పత్రాలను కనిపెట్టుకొని ఉండే సాధనాలను జతచేసింది. అంతేకాదు ఈ రెండు కంపెనీలు ఒకరిపై మరొకరు పోటీపడి వినియూగదారులకు సేవలు అందిస్తున్నారు ఉదాహరణకు ఈ-మెయిల్: జీ మెయిల్(గూగుల్) - హాట్ మెయిల్(మైక్రోసాఫ్ట్). అటు శోధనాయంత్రం ఇంటర్నెట్ తో పాటు ఇటూ డెస్క్‌టాప్ పైకూడా శోధన ఇంకా ఎన్నెన్నో. క్లిక్ ప్రాడ్ గూగుల్ వ్యపారానికి పెద్ద సమస్యగా దాపరించింది. 2004 డిసెంబర్ లో జరిగిన ఇన్వెస్టర్ మహాసభలో గూగుల్ సి.ఎఫ్.ఓ జార్జ్ రేస్ మాట్లాడుతూ "త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం కనుగొనకపోతే ఇది మన వ్యాపార పద్దతికే పెద్ద సవాలు అవుతుందని అన్నారు"[10] క్లిక్క ప్రాడ్ ను అరికటెందుకు గూగుల్ సరైన చర్యలు తీసుకోవట్లేదు అని కొంత మంది పెద్దల విమర్శలను కూడ ఎదురుకుంటుంది. అల్ కెమిస్ట్ ప్రెసిడెంట్ జెస్సి స్ట్రిచియోల ఈ సమస్య ను ప్రస్తావిస్తు "క్లిక్ ఫ్రాడ్ ను అరికటడానికి సంభదించి గూగుల్ అత్యంత మొండి వైఖరిని ప్రదర్శించండమే కాకుండ సహకరించడానికి కూడా సంసిద్దంగా లేదని ఆరోపించారు". ఇప్పటికి ప్రధాన వ్యాపార రంగం వెబ్సైట్ల పై వ్యాపార ప్రకటనలకు సంభందించి అయిన [రెడియో], ముద్రణ వంటీ ఇతర రంగాలపై కూడా దృష్టి సారించడం మొదలు పెట్టింది. జనవరి 17, 2006, రెడియో వ్యాపార ప్రకటనల కంపెనీ డి.మార్క్ ను కొన్నట్టుగా ప్రకటించింది.రెడియో పై ప్రకటనలు ఇవ్వదలచిన కంపెనీల కు ఒక ఆటొమెటిక్ వ్యవస్థ ద్వారా డి.మార్క్ సేవలను అందిస్తుంది.[11]వినియోగ దారుల అబిరుచులను ఇట్టె పసిగట్టె సామర్ధ్యం గల గూగుల్ దీనీ ద్వారా వ్యాపార ప్రకటనలకు రెండు ప్రధాన వ్యవస్థలను(ఇంటర్నెట్ మరియు రెడియో)కలపగలదు. తమ ప్రకటనకర్తల వ్యపార ప్రకటనలను గూగుల్ వార్తపత్రికలకు ఇతర పత్రికల కు పరిశోదనాత్మకంగా అమ్మడం మొదలు పెట్టింది.ముందుగా చికాగో సన్-టైమ్స్లో కొన్ని ఎంపిక చేయబడిన ప్రకటనల తో ఇది మొదలైంది.[12] అప్పటి వరకు పత్రికల వారు ప్రకటన కర్తలు లేక తమ సంస్థాగత ప్రకటలు ఇస్తున్న ఖాళీలను నింపడం మొదలుపెట్టారు.మార్చ్ 31, 2006న గూగుల్ స్టాండర్డ్ అండ్ పూర్స్500 జాబితా (ఎస్ మరియు 500) లో చోటు సంపాదించింది. గూగుల్ హాస్టన్ కి చెందిన బర్లింగటన్ రిసోర్స్ అనే ఓపెద్ద చమురు కంపెనీ స్థానాన్ని ఆక్రమించింది. [మార్చు] ఉత్పత్తులు మరియు సేవలు
గూగుల్ యొక్క ప్రధాన వ్యాపారం ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ మీదే ఆధారపడి ఉంది. దీనిలో ముఖ్య పదాల ఆదారంగా సంభందిత అంశం గుర్చిన సమాచారం(వెబ్సైటులు) తో పాటు చిత్రాలను, వార్తా విశేషాలతో పాటూ పరిశీలన చేయబడిన శాస్త్రీయ వ్యాసాలకు సందించిన సమాచారం కొరకు కూడా వెతకవచ్చు. [మార్చు] కార్పోరేట్ సంస్కృతి[మార్చు] "ఇరవై శాతం" సమయంప్రతీ గూగుల్ ఇంజనీరు తమ పని గంటలలో 20 శాతం సమయాన్ని తనకు నచ్చిన ప్రాజెక్ట్ పైన పని చేసే వీలు కల్పించబడింది.ఈ సమయాన్ని వారంలో ఒక రోజు కానీ మొత్తం కేటాయించిన సమయాన్ని సమీకరించి ఒక నెలగా కానీ వాడుకోవచ్చు. ఇలాంటి స్వయంసిద్ధ కృషి వలన జనించినవే ఆధునిక గూగుల్ పరికరాలు అయిన జీమెయిల్, గూగుల్ న్యూస్,ఆర్కుట్ లాంటి సేవలు. [మార్చు] ఐ.పి.ఓ మరియు గూగుల్ వ్యవహారిక సంస్కృతిచాలా మంది గూగుల్ ఐ.పి.ఓ తో కంపెనీ కల్చర్ లో మార్పు వస్తుందని ఊహించారు,[13]. ఉద్యోగుల ప్రయోజనాలు షేర్ హోల్డర్ల ఒత్తిడి వలనో, లేక కాగితం మీద కోటీశ్వరులవడం మూలానో మారవచ్చని ఊహించారు.. కానీ అలాంటివీ ఐ.పీ.ఓ వల్ల జరగవని గూగుల్ సృష్టికర్తలయిన సెర్గీ బ్రిన్ మరియు లారీ పేజ్ లు ఒక నివేదికలో పేర్కొన్నారు [14] తరవాత పేజ్ "మేము మా సంస్కృతి, సరదా తత్వం కాపాడటానికి చాలా ఆలోచిస్తామని" అన్నారు. గూగుల్ పెరుగుతున్నకొద్దీ ఆ సంస్థ "కార్పొరేట్" లాగా అవుతుందని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. 2005 వ సంవత్సరములో ప్రముఖ అమెరికా ఇంగ్లీష్ దినపత్రిక ది న్యూయార్క్ టైమ్స్, ఇంకా ఇతరులు గూగుల్ వ్యతిరేక వ్యాపారీకరణ(యాంటీ కార్పొరేట్), చెడు చెయ్యకూడదనే తత్వం కోల్పోయిందని చెబుతున్నారు. [15][16] [మార్చు] గూగుల్ భాగస్వాములుగూగుల్ 2005 [సెప్టెంబర్ 28] న నాసా ( అమెరికా దేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ )తో దీర్ఘకాలిక పరిశోధనకుగాను ఒక ఒప్పందాన్ని చేసుకొంది. దీని నిమిత్తమై గూగుల్, నాసా యొక్క ఏమ్స్ రీసెర్చ్ సెంటర్లో 10 లక్షల చదరపు అడుగుల పరిశోధనా కేంద్రాన్ని నిర్మిస్తున్నది. నాసా మరియు గూగుల్ సంయుక్తంగా వివిధ అంశాలలో పరిశోధన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నాయి. [మార్చు] మూలాలు
[మార్చు] మరింత తెలుసుకోవటానికి వనరులు
[మార్చు] బయటి లింకులు
[మార్చు] ఇంటర్నెట్ లో గూగూల్ వెబ్‌సైట్లు
[మార్చు] ఇతర లింకులు
|
||||||||||||||||||||||||